పులివెందులలో.. పలు అభివృద్ది పనులకు అంకురార్పణతో పాటు.. పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు
పులివెందులలో.. పలు అభివృద్ది పనులకు అంకురార్పణతో పాటు.. పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు
అందులో భాగంగా.. రూ.10.50 కోట్లు వెచ్చించి అభివృద్ధి కార్యాచరణ పూర్తయిన పులివెందుల మార్కెట్ యార్డును ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..
మార్కెట్ యార్డు గోడౌన్ తోపాటు అదే ఆవరణలో నిర్మాణాలు పూర్తయిన పలు భవనాలకు ప్రారంభోత్సవం చేసి.. అందుకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి.
పులివెందుల వ్యవసాయశాఖ మార్కెట్ యార్డు ఆవరణలో ముఖ్యమంత్రి ప్రారంభించిన నిర్మాణాలకు సంబందించిన వివరాలు రూ.479.00 లక్షల వ్యయంతో 6000 మెట్రిక్ టన్నుల సామర్థ్యము కలిగిన స్వీట్ ఆరెంజ్ లైమ్ షెడ్ నిర్మాణం ద్వారా చాలమణిలో ఉన్న దావా వ్యవస్థ నుండి చీనీ రైతులకు విముక్తి కలగనుంది. రైతులు పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు సమతుల్యమైన వాతావరణాన్ని కల్పించడం జరిగింది
రూ.93.00 లక్షల వ్యయంతో నిర్మించిన 16 కమర్షియల్ షాపుల సముదాయం ద్వారా మార్కెట్ యార్డు ఆవరణలోనే. రైతుల వ్యాపార నిర్వహణ, వ్యాపారస్థుల అమ్మకాలు, కొనుగోళ్లు సులభతరం కానున్నాయి
రూ.157.00 లక్షల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ మార్కెటింగ్ యార్డు నూతన కార్యాలయం ఛైర్మెన్ బిల్డింగులతో పాటు క్యాంటీన్ భవన నిర్మాణం ద్వారా పులివెందుల వ్యవసాయ మార్కెట్ కు అధునాతన హంగులు, వసతులతో పాటు రైతుల వ్యాపార వ్యవహారాలు మరింత విస్తృతం కానున్నారు.
రూ.100.00 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ద్వారా మార్కెటింగ్, గిడ్డంగులకు వ్యవసాయ సంబంధ వస్తువులు, ధాన్యం, సరుకు రవాణా మరింత సులభతరం కానుంది
వీటితో పాటు రూ.34.48 కోట్లకు పైగా అంచనా వ్యయంతో పులివెందుల, సింహాద్రిపురం మార్కెట్ యార్డుల్లో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ నిర్మాణాలు, 8 నూతన గౌడన్ల నిర్మాణాలు కార్యాచరణలో సాగుతున్నాయి
మరోవైపు పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల, వెంపల్లెలలో ఒక్కొక్కటి చొప్పున నూతన రైతు బజార్ల నిర్మాణాలు టెండర్లు పూర్తి చేసుకుని.. నిర్మాణ పనుల ప్రారంభానికి ప్రభుత్వం సంసిద్దంగా ఉంది.
ఇలా పులివెందుల నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి.. చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, పూర్తయిన నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు చేసిన ముఖ్యమంత్రి.. సొంతగడ్డపై.. తనకున్న మమకారాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు
కార్యక్రమంలో ముఖ్యమంత్రికి నాగలిని బహుకరించిన పులివెందుల వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జి.చిన్నప్ప, వైస్ చైర్మన్ సర్వోత్తమ రెడ్డి.అనంతరం స్థానిక రైతులను పేరు పేరున ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి
కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం అంజద్ బాషా, జిల్లా ఇంచార్జిమంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జేసీ (రెవెన్యూ) గౌతమి, జేసీ (అభివృద్ధి) సాయికాంత్ వర్మ, ఆర్డీఓ ధర్మ చంద్రా రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పులివెందుల వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జి.చిన్నప్ప, వైస్ చైర్మన్ సర్వోత్తమ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్ చైర్మన్లు వైఎస్ మనోహర్ రెడ్డి, హఫీజ్, పులివెందుల 3వ వార్డు కౌన్సిలర్ పద్మావతి, కాంట్రాక్టర్లు విద్యాధర్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, బయపురెడ్డి, ప్రజాప్రతినిధులు, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు
మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సంబందిత శాఖల సీఎంవో ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు