పులివెందులపరిధిలో రూ.27.6 కోట్లతో ఆలయ నిర్మాణాలు
రూ. 14.5 కోట్లతో గండి అభివృద్ధి కార్యక్రమాలు.
కడప ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పులివెందుల పరిధిలో రూ 27.6 కోట్లతో వివిధ ఆలయాల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు కడప అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ పేర్కొన్నారు. పులివెందుల మిట్ట మల్లేశ్వర స్వామి కళ్యాణ మండపంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండి ఆలయ అభివృద్ధి పనులకు 14.5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. పులివెందుల నియోజకవర్గం పరిధిలోని 23 ఆలయాల అభివృద్ధికి , కాలనీలలోమరో 24 ఆలయాల నిర్మాణాలకు మొత్తం 47 ఆలయాల అభివృద్ధికి 9.20 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. పులివెందుల సంబంధించి శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో కోనేరు నిర్మాణం,ఇతర నిర్మాణాలకు 90 లక్షలు ,తూర్పు వీరాంజనేయ స్వామి ఆలయ రాజగోపురం, శ్రీమన్నారాయణ స్వామి ఆలయ నిర్మాణానికి 1.2 కోట్లు , మిట్టమల్లేశ్వర స్వామి రాజగోపుర నిర్మాణానికి 60 లక్షలు, అంకాలమ్మ దేవస్థానం ఆలయ గోపురానికి 56 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు .ఇందుకు సంబంధించి న అభివృద్ధి పనుల శిలా ఫలకం నుముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప- చిత్తూరు ఎండోమెంట్ డిఈ గంగయ్య, గండి ఆలయ ఈవో గురు ప్రసాద్ ,పులివెందుల గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఈవో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.