Andhra PradeshCrimeKurnoolTelangana
పీర్ల గుండములో దూకి వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా
పీర్ల గుండములో దూకి వ్యక్తి మృతి
అవుకు రూరల్ మండలంలోని సుంకేసుల గ్రామం లో పీర్ల గుండములో దూకి వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కాశీపురం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య (55) అనే వ్యక్తి మొహరం వేడుకలను తిలకించేందుకు పీర్ల గుండ వద్దకు వచ్చాడు.
స్థానికులు అందరూ చూస్తుండగానే ఉన్నట్లుండి ఒక్కసారిగా పీర్ల గుండంలోకి దూకాడు. స్థానికులు గమనించి హుటాహుటిన బయటకు తీసే లోపే పూర్తిగా కాలీ పోయాడు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్వరరెడ్డి తెలిపారు.