
నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తల కృషి ఫలించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సి-51 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు.
ఆదివారం ఉదయం 10.24 గంటలకు ధ్రువ ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక-సి51 (పీఎస్‌ఎల్‌వీ) నింగిలోకి దూసుకె ళ్లింది. ఇది ఇస్రో ఈ ఏడాది చేపట్టిన మొదటి ప్రయోగం కాగా… మొదటి ప్రయోగ వేదిక నుంచి 39వ ప్రయోగం.
పీఎస్‌ఎల్‌వీ-డీఎల్ వర్షన్‌లో మూడోది. ప్రయోగం నేపథ్యంలో షార్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్రెజిల్ దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ క్వాంటస్ షార్‌కు చేరుకుని ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. పీఎస్‌ఎల్‌వీ-సి51 వాహకనౌక ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజొనియా-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపారు. ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు..