పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ
పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన తళ్లెం భరత్ కుమార్ రెడ్డి
ఓబులవారిపల్లి జనవరి 13:-మండల పరిధిలోని మంగంపేట గ్రామ పంచాయతీలోని పారిశుద్ధ్య కార్మికులకు వైఎస్ఆర్ సీపీ యువజన నాయకుడు తళ్లెం భరత్ కుమార్ రెడ్డి వారి సేవలకు కృతజ్ఞతగా సంక్రాంతి పండుగ సందర్భంగా తళ్లెం విష్ణు వర్ధన్ రెడ్డితో కలిసి వారికి నాణ్యమైన దుస్తులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా తళ్లెం భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సూర్యుడు ఉదయించక ముందే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ,కరోనా కష్టకాలంలో వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ వారి ఉదారతను చాటుతూ వారి శ్రమకు గుర్తింపుగా ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో నా వంతు చిరు సాయంగా వారికి దుస్తులు పంపిణీ చేయడం నాకు తృప్తిగా ఉందని తెలియజేశారు.
ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ మా సేవలు గుర్తించి మాకు సంక్రాంతి పండుగ సందర్భంగా మాకు దుస్తులు పంపిణీ చేసిన తళ్లెం భరత్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌలురి రమణా రెడ్డి,దేసూరి వెంకటసుబ్బారెడ్డి,శంకర్ రెడ్డి, పుల్లారెడ్డి గారి నరేంద్ర రెడ్డి, సుదర్శన్ రెడ్డి,రాముడు, శివయ్య,కుమార్,సుంకన్న, ప్రసాద్,రవి,వెంకటేష్,రమణ,బాలు,రామాంజనేయులు మరియు వైఎస్సార్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.