పల్లెకు టికెట్ వద్దంటూ వాట్సాప్ లో జోరుగా సందేశాలు

టీడీపీ నేతలు అప్పుడే టికెట్ల కోసం పోరుబాట పట్టారు. రానున్న ఎన్నికల్లో తమకంటే తమకే టికెట్ ఇవ్వాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా అధిష్టానానికి తమ వాణి బలంగా వినిపిస్తున్నారుఅలాగే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లపై నిరసన గళం వినిపిస్తూ వారి అరాచకాలు, అక్రమాలను బయటపెడుతున్నారు. తాజాగా పుట్టపర్తిలో తమ్ముళ్ల గ్రూపు రాజకీయం రచ్చకెక్కింది.పల్లెకు టికెట్ వద్దంటూ వాట్సాప్ సందేశాలు..పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లెకు సొంత పార్టీ నుంచే నిరసన సెగ తగులుతోంది. గడచిన నాలుగేళ్లుగా పల్లెకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడుస్తోంది. నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన నేతలు పెదరాసు సుబ్రహ్మణ్యం, మున్సిపల్ మాజీ చైర్మన్ పీసీ గంగన్న, ఓడీచెరువుకు చెందిన ఇస్మాయిల్ అసమ్మతి వర్గంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. టీడీపీ టికెట్ ఈసారి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఇవ్వకూడదంటూతాము టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ విజయానికి కృషి చేస్తూ వస్తున్నామని ‘పల్లె’ వ్యతిరేక వర్గం వాదిస్తోంది. చివరకు గతంలో ‘పల్లె’ గెలుపులోనూ తమదే కీలక పాత్ర అని చెబుతోంది. తాము ఇంత చేస్తే బీసీలు, సీనియర్లను ‘పల్లె’ ఏమాత్రం పట్టించుకోకపోగా, అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని సుబ్రహ్మణ్యంతో పాటు ఇతర అసమ్మతి నేతలు వాపోతున్నారు. ప్రతి ఎన్నికల్లోన తామే సొంతంగా డబ్బులు ఖర్చు చేసి పార్టీ అభ్యర్థుల విజయానికి పాటు పడ్డామని, అలాంటి తమను పల్లె ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అందువల్ల తామూ ఆయనకు మద్దతు పలికేది లేదని స్పష్టం చేస్తున్నారు. గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత రెండురోజులుగా పల్లెకు వ్యతిరేకంగా ఏకంగా వాట్సప్‌సందేశాలను వైరల్ చేస్తున్నారు. టీడీపీ గ్రూపులతో పాటు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి చెందిన వాట్సాప్ గ్రూపుల్లో పల్లెకు వ్యతిరేకంగా సందేశాలు వైరల్ చేస్తున్నారు.అసమ్మతి నేతల చర్యలతో దిక్కుతోచని స్థితిలో పడిన పల్లె రఘునాథరెడ్డి కొందరిని ఇంటికి పిలిపి బుజ్జగించే పనిలో పడినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో రోజురోజుకూ తన ప్రాభవం తగ్గుతుండటంతో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు అనుచరులే చెబుతున్నారు. అసమ్మతి నేతల చర్యలతో ఈసారి టికెట్ వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.