పరస్పర సహాయ సహకార పొదుపు సంఘాల లిమిటెడ్ కార్యవర్గ సమావేశం
పరస్పర సహాయ సహకార పొదుపు సంఘాల లిమిటెడ్ కార్యవర్గ సమావేశం లింగాల జనవరి19:- దస్తగీరమ్మ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. రెండు లక్షల ఇరవై రెండు వేలు వస గ్రామ సమాఖ్య లో సామాజిక పెట్టుబడి నిధి మరియు శ్రీనిధి డబ్బులు వసూలు అవుతుందని నగదు కౌంట్ చేసే మెషిన్ అవసరం గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ వైయస్ఆర్ క్రాంతి పదం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం లో లింగాల గ్రామపంచాయతీ కే ఎఫ్ డబ్ల్యూ ప్రాజెక్టులో ప్రకృతి వ్యవసాయం గ్రామంగా ఎంపిక చేయడం జరిగిందని స్వయం సహాయక సంఘాల లోని మహిళలు రైతుల సమగ్ర సమాచారం సేకరించి ప్రకృతి వ్యవసాయం లో తక్కువ పెట్టుబడి తో ఎక్కువ ఆదాయం సంపాదించేందుకు మార్గాలను అన్వేషించడం జరుగుతుందని తెలియజేశారు మండల సి ఆర్ పి మనోహర్ మాట్లాడుతూ కే యఫ్ డబ్ల్యూ బేస్లైన్ సర్వే లో ప్రతి సంఘం సభ్యురాలు యొక్క సమగ్ర సమాచారాన్ని సేకరించడం జరుగుతుందని తద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయుటకు మరియు రైతులకు ప్రకృతి వ్యవసాయం పైన సలహాలు సూచనలు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. కె ఎఫ్ డబ్ల్యూ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం అవగాహన ర్యాలీ స్వయం సహాయక సంఘం మహిళల చేత నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సమాఖ్య కార్యదర్శి కమల గ్రామ సమాఖ్య కోశాధికారి గౌసియా ఐ సి ఆర్ పి రాజేశ్వరి గ్రామ సమాఖ్య అసిస్టెంట్ చంద్రకాంత స్వయం సహాయక సంఘాల సభ్యులు మరియు దాకా లీడర్లు పాల్గొన్నారు