పంజాబ్ కింగ్స్ జట్టు కు ఆల్‌రౌండర్ షారుఖ్ ఖాన్‌ను సొంతం
న్యూఢిల్లీ: నేడు జరిగిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు తమిళనాడుకు చెందిన ఆల్‌రౌండర్ షారుఖ్ ఖాన్‌ను సొంతం చేసుకుంది. రూ. 5.25 కోట్లకు షారుఖ్ ఖాన్ ఈ జట్టులోకి చేరాడు. అంతకుమనుపు.. ఈ ఆల్ రౌండర్ కోసం మూడు జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఒకానొక దశలో తీవ్ర పోటీ నెలకొంది. కానీ చివరకు ప్రముఖ నటి ప్రీతీ జింటా నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ షారుఖ్ ఖాన్ సొంతం చేసుకుంది. అయితే..వేలంలో గెలిచామని తెలియగానే ప్రీతీ జింటా చపట్లు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ రియాక్షనే ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. షారుఖ్ మన టీమ్ అయితే ఆనందం కాదా.అంటూ బాలీవుడ్ స్టార్ షారుఖ్‌ను గుర్తుతెచ్చేలా నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఆన్‌క్యాప్ ప్లేయర్స్‌లొ ఒకడైన షారుఖ్ ఖాన్ రూ. 20 లక్షల బేస్ ధరకు ఆక్షన్‌లొకి ప్రవేశించాడు. పంజాబ్స్ కింగ్స్ జట్టు ఏకంగా రూ. 5.26 కోట్లకు షారుఖ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకుంది.