Andhra PradeshLatest NewsTelanganaYSR Kadapa
పంచాయతీ ఎన్నికల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలని dsp నాగరాజు
పంచాయతీ ఎన్నికల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలని dsp నాగరాజు
మైలవరం ఫిబ్రవరి 04:-: రానున్న పంచాయతీ ఎన్నికల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్‌డీపీవో(సబ్ డివిజనల్ పోలీసు అధికారి) నాగరాజు అన్నారు. మండలంలో పోలీసు అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి గొడవలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పల్లెల్లో వివాదాలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేయాలన్నారు. సమావేశంలో ఎస్సై ప్రవీణ్ కుమార్, తలమంచి పట్టణం ఎస్సై ధనుంజయుడు తదితరులు పాల్గొన్నారు.