పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

అమరావతి: పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. 2019 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోవడం.. పంచాయతీ నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. నామినేషన్లు ప్రారంభమయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేమని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. 2021 ఓటర్ల జాబితా అందుబాటులో లేకపోవడంతో.. 2019 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకున్నామని ఎస్‌ఈసీ న్యాయవాది వాదించారు. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు పిటిషన్‌ను కొట్టేసింది.అర్హులకు ఓటు హక్కు అవకాశం కల్పించకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమంటూ గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.2019 ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనివల్ల 18ఏళ్లు నిండిన 3.6లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోతారు. ఇది రాజ్యాంగంలోని 326వ అధికరణను ఉల్లంఘించడమే. యువతకు ఓటుహక్కు కల్పించాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. అప్పటివరకు నోటిఫికేషన్‌ను రద్దు చేయాలి. పంచాయతీ ఎన్నికల్లో ఒకట్రెండు ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తాయి’ అని కోర్టు దృష్టికి అఖిల తీసుకొచ్చారు.
అర్హులకు ఓటు హక్కు అవకాశం కల్పించకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమంటూ గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.2019 ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనివల్ల 18ఏళ్లు నిండిన 3.6లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోతారు. ఇది రాజ్యాంగంలోని 326వ అధికరణను ఉల్లంఘించడమే. యువతకు ఓటుహక్కు కల్పించాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. అప్పటివరకు నోటిఫికేషన్‌ను రద్దు చేయాలి. పంచాయతీ ఎన్నికల్లో ఒకట్రెండు ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తాయి’ అని కోర్టు దృష్టికి అఖిల తీసుకొచ్చారు.