Andhra PradeshLatest NewsPoliticalTelanganaYSR Kadapa
నిమ్మగడ్డకు అస్వస్థత..
కడప జిల్లా టూర్ వాయిదా
కంటి ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్న నిమ్మగడ్డ
ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకోనున్న ఎస్ఈసీ..రేపే పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్..
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. తాజాగా ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కంటి ఇన్ఫెక్షన్ తో ఆయన బాధపడుతున్నారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో ఆయన ఐ టెస్ట్ చేయించుకోనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈనాటి కడప జిల్లా పర్యటనను ఆయన వాయిదా వేసుకున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ రేపు జరగనుంది. ఈ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.