నాసిరకం మద్యం విక్రయాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం
రైల్వే కోడూరు మన జనప్రగతి మార్చి 18:- పట్టణం నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కస్తూరి విశ్వనాధ నాయుడు రాష్ట్రంలో కల్తీ సారా నిర్మూలన, మద్యం షాపుల్లో జే బ్రాంర్డ్స్ ను నిషేధించాలని డిమాండ్ చేస్తూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మద్యాన్ని నిషేధిస్తానని, నాటుసారాని రూపుమాపుతానని మాయమాటలు చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జే బ్రాండ్ నాసిరికం మద్యం అమ్మడమే కాక, మరో వైపు నాటుసారా మాఫియాని పెంచి పోషిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు.
వైసీపీ ప్రభుత్వం అమ్ముతున్న మద్యం నమూనాలను ల్యాబ్ లో పరీక్ష చేయించగా వాటిలో ఓల్కనిన్, పైరోగాలో, స్కోపరొన్ అనే ప్రమాదకరమైన పదార్థాలు ఉన్నట్లు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజే చెప్పారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా నాటు సారా మాఫియా చెలరేగి పోతున్నదన్నారు. ఓవైపు డాక్టర్ల రిపోర్టులు అన్నీ మద్యం తాగడం వల్లే మరణించారని చెబుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం అవి అసహజ మరణాలు అంటూ అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పటం సిగ్గుమాలిన చర్య అని కస్తూరి అన్నారు.ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కమతం నాగరాజు, ప్రముఖ న్యాయవాది కేజేపీ రెడ్డయ్య, రైల్వేకోడూరు గ్రామపంచాయతీ మాజీ ఉప సర్పంచ్ నార్థాల హేమరాజ్, మాజీ సర్పంచ్ శివయ్య, రాజంపేట పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులుపులెల రమేష్, రాజంపేట పార్లమెంట్ టిడిపి కార్యదర్శి షేక్ తాజుద్దీన్, రైల్వేకోడూరు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తేనే పల్లి చిన్న, ఐ టిడిపి కోఆర్డినేటర్ తులసి వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు.