నాసిక్ లో బస్సు దగ్దం…..11 మంది మృతి

నాసిక్ లో బస్సు దగ్దం…..పదకొండు మంది మృతి
నాసిక్
మహారాష్ట్రలోని నాసిక్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చేలరేగడంతో పదకొండు మంది మృతి చెందారు. మరో 38 మందికి గాయాలయ్యాయి. . శనివారం తెల్లవారుజామున నాసిక్-ఔరంగాబాద్ హైవేపై వెళ్తున్న లగ్జరీ ప్యాసింజర్ బస్సు లో హోటల్ ఇల్లీ చౌక్ దగ్గర ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శనివారం తెల్లవారు జామున 4.20 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన నాసిక్ పోలీసులు క్షతగాత్రులను అసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని సమాచారం. ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, గాయాపడినవారికి యాభై వేల రకూపాయల నష్టపరిహారం ప్రకటించారు. మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండే కుడా మృతులకు ఐదు లక్షలు, క్షతగాత్రులకు వైద్య ఖర్చులు పరిహారంగా ప్రకటించారు