నాలుగేళ్ల పాప అత్యాచారం ఘటన పై మండిపడ్డ ప్రపంచ మానవ హక్కుల సంఘం
రాయచోటి జనవరి 19 :-బాధితిరాలు వారి కుటుంబాన్ని పరామర్శించిన ప్రపంచ మానవ హక్కుల సంఘం సభ్యులు చట్టాలపై అవగాహన లేకపోవడం చట్టాలు సత్వరం అమలు కాకపోవడం ఇలాంటి అఘాయిత్యాలకు కారణంఇటీవల ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన రాయచోటి పట్టణంలోని ఒక కుటుంబంలో ఉండే బాలిక ( 4 సం) పై పైన నివాసం ఉంటున్న సాయిపీర్ అలియాస్ భాష ( 40 సం) అత్యాచారానికి పాల్పడటం మానవత్వాన్ని మంటగలిపే చాలా దారుణమైన సంఘటన అని డబ్ల్యూ హెచ్ ఆర్ ఎ (ప్రపంచ మానవ హక్కుల సంఘం) రాయచోటి నియోజకవర్గ చైర్మన్ రమేష్ రాజు బాధను వ్యక్తం చేశాడు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా బాలిక కుటుంబానికి న్యాయం జరిగేటట్టు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తెలిపారు. మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో మీరు ఎటువంటి సహాయం చేయడానికి అయినా మేము ముందుంటామని న్యాయం జరిగేలా నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని తెలపడంతో పాటు పాప తల్లిదండ్రులకు పాప చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయంగా 2500 నగదు బ్రెడ్ పండ్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ రాయచోటి చైర్మన్ రమేష్ కుమార్ రాజు వైస్ చైర్ మన్ సాయిప్రతాప్ రెడ్డి వర్కింగ్ చైర్మైన్ జ్ఞానేంద్ర రెడ్డి జెనరల్ సెక్రటరీ షేక్ చాన్ బాషా లక్కిరెడ్డి పల్లి మండల చెర్మన్ భువనేస్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు