నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి జానారెడ్డి
మన జనప్రగతి జనవరి 07:- నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి జానారెడ్డిని అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మాణిక్యం ఠాగూర్.. ఈ విషయాన్ని తెలిపారు.టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్.. దుబ్బాక తరహాలో ఇక్కడ కూడా సత్తా చాటాలని బీజేపీ వ్యూహారచన మొదలుపెట్టాయి.ఇక గతంలో తమ సిట్టింగ్ స్థానంగా ఉన్న ఈ సీటును మరోసారి తమ సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికే ఆ పార్టీ ఛాన్స్ ఇచ్చింది.ఇక కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను పాటిస్తామని రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలంతా అంగీకరించినట్టు తెలుస్తోంది. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ గెలుపు చాలా ముఖ్యమని.. పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో కచ్చితంగా గెలవాలని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది