నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో నోముల కుటుంబానికే సీటు ఇవ్వాలి : యాదవ్ ఉత్తాన్ సమితి భారత్ (వై.యూ.ఎస్.బి)
మాచర్ల డిసెంబర్ 23 నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో నోముల కుటుంబానికే సీటు ఇవ్వాలి : యాదవ్ ఉత్తాన్ సమితి భారత్ (వై.యూ.ఎస్.బి) ఉత్తాన్ సమితి భారత్ గుంటూరు జిల్లా అధ్యక్షులు మున్నా అశోక్ సింహ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అశోక్ సింహ యాదవ్ మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మరణం వల్ల ఉప ఎన్నికలు జరున్నాయి. కాబట్టి నాగార్జున సాగర్ నియోజకవర్గ బాధ్యతలను, నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును నోముల కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలోను ఆ నాగార్జున సాగర్ నియజజవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీకి బలోపేతానికి ప్రసిద్ధుడు నోముల. అలాంటిది ఆ నియోజకవర్గ సీటును వేరే వారికి ఇవ్వడానికి వీల్లేదని అన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ స్థాయిలోను గతంలోను యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యే గా కొనసాగరని, గత ఎన్నికల్లో కూడా యాదవ్ సామాజిక వర్గం నుంచి వచ్చిన నోముల కూడా ఎమ్మెల్యే గా చేశారన్నారు. అందుకే నాగార్జున సాగర్ నియోజకవర్గానికి యాదవలకే సీటును కేటాయించాలని అశోక్ సింహ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘ సభ్యులు పలువురు పాల్గొన్నారు.