నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం భేటీ.
తిరుపతి పార్లమెంట్ నవతరం పార్టీ అభ్యర్థి సొంగా రత్నమ్మ తో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం భేటీ.
శ్రీకాళహస్తి ఫిబ్రవరి 11;- నవతరం పార్టీ కార్యాలయంలో తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి సొంగా రత్నమ్మ తో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం భేటి అయ్యారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక సందర్భంగా నవతరం పార్టీ విధి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని,ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు వివరించాలని ఆమెకు సూచించారు.చిత్తూరు జిల్లా నేతలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల కోసం ఇంచార్జ్ లను నియమిస్తామని తెలిపారు.తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు,సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని మండలాలకు ఇంచార్జ్ లను నియమించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నామని తెలిపారు.నవతరం పార్టీ ముఖ్య నేతలందరూ తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా కార్యక్రమం రూపొందించామని తెలిపారు.కార్యక్రమంలో సొంగా సిరాజ్,రాకేష్,షేక్ నౌషాద్,బుక్కే సహదేవయ్య తదితరులు పాల్గొన్నారు.