నల్లపురెడ్డిపల్లెలో ఘర్షణ… తుపాకి కాల్పుల్లో ఇరువురు మృతి
నల్లపురెడ్డిపల్లెలో ఘర్షణ… తుపాకి కాల్పుల్లో ఇరువురు మృతి
వ్యక్తిగత తగాదాలే కాల్పులకు కారణం పులివెందుల మన జన ప్రగతి జూన్ 15 :-మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లె గ్రామంలో వైసీపీకి చెందిన రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో జరిగిన తుపాక్ కాల్పుల్లో పార్ధసారధిరెడ్డి (48), ప్రసాద్ రెడ్డి (62) అనే వ్యక్తులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ కుటుంబాల మధ్య గత కొంతకాలంగా పాతకక్షలు ఉన్నాయని, మంగళవారం ఉదయం సుమారు 6.30 గంటల ప్రాంతం లో పార్ధసారధిరెడ్డి తమ ఇంటికి ఎదురుగా ఉన్న వైసీపీ మండల కన్వీనర్ కొమ్మా శివప్రసాద్ రెడ్డి ఇంటిపైకి దాడికి వెళ్లాడు. వెంటనే కొమ్మా శివప్రసాద్ రెడ్డి తనవద్ద ఉన్న లైసెన్స్ గన్ తీసుకుని పార్ధసారధిరెడ్డిని కాల్చాడు. వెనువెం టనే శివప్రసాద్ రెడ్డి కూడా తన తుపాకితో కాల్చుకున్నాడు. నన్ను చంపుతాడేమోనన్న భయంతో శివప్రసాదొడ్డి కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ అన్బురాజన్, అడిసినల్ ఎస్పీ ఖాసిం సాబ్, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ భాస్కర్రెడ్డి తమ సిబ్బం దితో ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు పికెట్ను ఏర్పాటు చేశారు. మృత దేహాలను పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైఎస్ కుటుంబ సభ్యులు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వైఎస్ భాస్కర్ రెడ్డి, పురపాలక ఇన్చార్జ్ వైఎస్ మనోహర్రెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంక రెడ్డి, వైసీపీ నేత దంతులూరి కృష్ణా, మృత దేహాలను సందర్శించి ఆయా కుటుంబస భ్యులను పరామర్శించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసు లు స్థానిక అర్బన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో మాట్లాడుతూ పార్థసారధిరెడ్డి గతంలో కొమ్మా శివప్రసాద్ రెడ్డి ఇంటిపై పెట్రోలు పోసి బెదిరించా డని, అలాగే 2018లో పోలీసులపై దాడి చేసిన కేసు కూడా ఉందని గత కొద్దిరోజులుగా పార్ధసారధిరెడ్డి మతిస్థిమితం కోల్పోయి ఇలాంటి ఘటనలకు పాల్పడేవాడని, ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పార్ధసారధిరెడ్డి కత్తి తీసుకుని ఎదురుగా ఉన్న కొమ్మా శివప్రసాద్ రెడ్డిపై దాడికి దీంతో శివప్రసాద్ రెడ్డి తన వద్ద ఉన్న లైసెన్స్ గన్ తీసుకుని పార్ధసారధిరెడ్డిని కాల్చడంతో పాటు తీవ్ర మనస్థాపానికి గురై తనకు తాను కాల్చుకుని మృతి చెందాడని వివరించారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.