Andhra PradeshCrimeLatest NewsNalgondaTelangana
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 8 మంది మృతి
హైదరాబాద్ : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. జిల్లాలోని పియపల్లి మండలం అంగడిపేట వద్ద ఆటో-కంటెయినర్ ఢీకొన్నాయి. పరస్పరం వేగంగా ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా మరో నలుగురు చనిపోవడంతో మృతుల సంఖ్య 8కి చేరింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 15 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా రోజువారీ కూలీలేనని గుర్తించారు