Andhra PradeshCinemaLatest NewsTelangana
నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల హత్య…
జైపూర్ : రాజస్తాన్‌లో నడిరోడ్డుపై ఇద్దరు డాక్టర్ దంపతులను ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన భరత్‌పూర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగింది. నిందితులిద్దరు బైక్‌పై వచ్చి… ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలన్నీ సిసిటివి ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. కారును ఓవర్ టేక్ చేసిన దుండగులు…వాహనానికి బైక్‌ను అడ్డుపెట్టి…కారు వద్దకు వెళ్లి దంపతులపై కాల్పులు జరిపారు. అనంతరం వారు వచ్చిన వాహనంపై పరారయ్యారు. పాత కక్షల కారణంగా ఈ హత్యలు జరిగాయని పోలీసులు తెలిపారు. రెండేళ్ల క్రితం నాటి ఓ మహిళా హత్య కేసులో మహిళా డాక్టర్, ఆమె తల్లిపై అభియోగాలు నమోదయ్యాయి. చనిపోయిన మహిళతో డాక్టర్ భర్తతో అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఈ కాల్పులకు పాల్పడింది బాధిత మహిళ సోదరుడు అని తెలిసిందని చెప్పారు.