ద్రవ జీవామృతం పైన రైతులకు అవగాహన
లింగాల జనవరి 27:- ఎగువ పల్లి గ్రామం ప్రకృతి వ్యవసాయ రైతు సాయినాథ్ రెడ్డి నాలుగువందల లీటర్ల ద్రవ జీవామృతం తయారుచేసి అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ డి ఆర్ డి ఏ ఆంజనేయులు మరియు ప్రకృతి వ్యవసాయం సిబ్బంది కి చూపించడం జరిగింది. దీనిని సుమారు పది రకాల పంటలకు వాడుతాం అని సాయినాథ్ రెడ్డి తెలియపరిచారు జీవామృతాన్ని డ్రిప్ ద్వారా భూమికి వదలవచ్చు.జీవ అమృతాన్ని 100 లీటర్ల నీటికి ఆరు లీటర్ల జీవామృతాన్ని ఫిల్టర్ చేసుకోవాలి చీనీ చెట్లు ఒక సంవత్సరం దాటిన చెట్లకు అయితే వంద లీటర్ల కి 10 లీటర్ల చొప్పున చొప్పున ప్రతి 15 రోజులకు ఒకసారి పారించడం ద్వారా చెట్లు ఏపుగా పెరగడమేకాకుండా రోగనిరోధకశక్తిని తట్టుకుని పురుగుల నివారణకు బాగా పనిచేస్తుంది. అదేవిధంగా నిస్సారమైన భూములకు ఈ జీవనం సాగించడం ద్వారా సూక్ష్మ స్థూల పోషకాలు బాగా అభివృద్ధి చెంది. వానపాములు సంఖ్య పెరిగి భూమి గుల్ల బడుతుంది. ద్రవ జీవామృతం పైన రైతులకు అవగాహన కల్పించి ఎక్కువమంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అవగాహన పెంచాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది kfw బాబు భాస్కర్ రెడ్డి వెంకటరమణ