ద్రవ జీవామృతం తో భూమి సారవంతం అవుతుంది
ద్రవ జీవామృతం తో భూమి సారవంతం అవుతుంది
ప్రకృతి వ్యవసాయం తో సంపూర్ణ ఆరోగ్యం
ప్రకృతి వ్యవసాయం పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ
బ్రహ్మంగారి మఠం మన జన ప్రగతి:- జీవామృతం తో భూమి సారవంతం అవుతుందని అలాగే ప్రకృతి వ్యవసాయంతో రైతన్నలకు పూర్తిస్థాయిలో పెట్టుబడి తక్కువగా పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని అలాగే ప్రకృతి వ్యవసాయం పంట పూర్తిస్థాయిలో సంపూర్ణ ఆరోగ్యం బలవుతున్నారు ప్రకృతి వ్యవసాయం పి ఆర్ పి కరిముళ్ల శాఖాద్రి తెలిపారు శనివారం బ్రహ్మంగారిమఠం మండలం లోని చౌదరి వారి పల్లి క్లస్టర్ డి నేలటూరు పంచాయతీ, గ్రామంలో వెంకటేశ్వర్లు అనే కౌలు రైతుకు దానిమ్మ తోటకు 5000 లీటర్లు ద్రవజీవామృతంసామూహికంగా తయారు చేయడం జరిగింది, ద్రవ జీవామృతం తయారు చేసుకొని ఉపయోగించడం వల్ల భూమిలో సూక్ష్మ స్థూల పోషకాలు విలువలు పెరిగి భూమిలో వానపాముల శాతం పెరుగుతుంది, భూమి సారవంతంగా తయారవుతుంది అని వివరించడం జరిగింది, మరియు రబీ సీజన్లో పంటలు పండిస్తున్న, ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగుకు పాటించవలసిన ప్రకృతి వ్యవసాయంలో రాజీలేని అంశాలు, పక్షి స్థావరాలు, లింగాకర్షక బుట్టలు, పసుపు తెలుపు పల్లాలు, పొలాలలో పెట్టడం వల్ల కలిగే లాభాలు మరియు వివిధ రకాలైన కషాయాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో PRP కరిముళ్ల శాఖాద్రిమరియుMCRPసుధాకర్,ICRPసిద్ధారెడ్డి మరియు రైతులు పాల్గొనడం జరిగింది.