దేశంలో రిజర్వేషన్ల జోలికి వస్తే తిరుగుబాటు తప్పదు.. కేంద్ర ప్రభుత్వం కు రిజర్వేషన్లు పరిరక్షణ సమితి హెచ్చరిక…
అనంతపురం డిసెంబర్ 20
దేశంలో క్రమ క్రమంగా రిజర్వేషన్లను తొలగించే కుట్రకు బిజెపి శ్రీకారం చుట్టింది.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సందర్భా లలో రాజ్యాంగ ము మీద,రిజర్వేషన్ల మీద వ్యతిరేకంగా పార్టీ నాయకులు, కేంద్ర మంత్రులు, స్పీకర్లు, RSS, నేతలు మాట్లాడుతూ78 %శాతం ఉన్న BC, SC, ST ప్రజల మనోభావాలు దెబ్బ తీసేందుకు వీరు అధికారం అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తున్నారని, నిజంగా వీరు రాజ్యాంగ ము మీద ప్రమాణం చేశారు మరి ఎందుకు ఈ వర్గాల మీద విషం చిమ్ముతూ పాలన చేస్తున్నారు.
వీరుకి నిజంగా దమ్ము ఉంటే రిజర్వేషన్లను ఎత్తి వేయమనండి,రాజ్యాంగ మును రద్దు చేయమనండి.
దేశంలో ప్రతిభ దెబ్బతిందని, అభివృద్ధి జరగలేదు అని మొసలి కన్నీళ్లు కారుస్తూ ఉన్న మేధావులకు ఒకటే ప్రశ్న.
స్వాతంత్ర్య ము వచ్చి 74 సంవత్సరాలు అవుతుంది, రాజ్యాంగము అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది, మొదటి సారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయి 68 సంవత్సరాలు అవుతుంది.
ఇంత వరకు ఎంతమంది BC, SC, ST, దేశ ప్రధానులు అయ్యారు, యెంత మంది ముఖ్యమంత్రు లు అయ్యారు, ఎంత మంది గవర్నర్ లు అయ్యారు, ఎంత మంది సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ లు , హైకోర్టు చీఫ్ జస్టిస్ లు అయ్యారు,930 యూనివర్సిటీ లలో వైస్ ఛాన్సలర్ లు అయ్యారు, సమాధానం చెప్పాలి,. మొత్తం అధికారము మీ దగ్గర పెట్టుకుని ప్రతిభ దెబ్బతిందని గగ్గోలు పెడుతున్నారు ఇది దేశంలో అమలు అవుతున్న రాజ్యాంగ ము ప్రాథమిక హక్కులలో ఉన్న సమానత్వం ఎక్కడ 74 సంవత్సరాలలో అమలు చేసారో సమాదానం చెప్పాలి.
1992 వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలో 52 శాతం ఉన్న బీసీ లకు రిజర్వేషన్లు లేవు అంతవరకు IAS, IPS ఉద్యోగాలలో ఎవరు ఉన్నారు, IIT, IIM, రక్షణ రంగంలో, ఉన్నత విద్యా లో ఎక్కడ రిజర్వేషన్లు లేవు మరి అపుడు ప్రతిభ ఎక్కడ పోయింది.
కేంద్రంలో OBC లకు రిజర్వేషన్లు 1992 నుంచి మండల్ కమీషన్ సిఫార్సు లు అమలు కావడం తో OBC లకు రిజర్వేషన్లు అమలు చేస్తున్న దేశంలో1995 నుంచి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు శ్రీకారం చుట్టి రిజర్వేషన్లు అమలు కాకుండా దొడ్డిదారిన నియామకాలు చేపట్టారు, ఇప్పటి వరకు దేశంలో45 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కాళీగా ఉంటే ఎందుకు భర్తీ చేయాలేదు కేంద్ర ప్రభుత్వ ము సమాధానం చెప్పాలి. అంటే ఉద్యోగాలలో రిజర్వేషన్ వర్గాలు ఉండటం ఇష్టం లేదా, మరి ఎందుకు భర్తీ చేయలేదు.
అందుకే రిజర్వేషన్ల పరిరక్షణ సమితి దేశంలో రిజర్వేషన్ల ప్రాథమిక హక్కు అని అవి ఎవరి బిక్ష కాదు అని రాజ్యాంగ ము కల్పించే హక్కులను కాపాడుకోలేమా అని SC, ST, BC లకు విజ్ఞప్తి చేస్తు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తామని తెలియచేస్తూ.
ఈరోజు R&B గెస్ట్ హౌస్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు పోతుల నాగరాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి పుల్లయ్య, REF జిల్లా అధ్యక్షులు నారాయణ నాయక్,శ్రీరాములు, BC ఉద్యోగుల సంక్షేమ సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్, జిల్లా అధ్యక్షులు చక్రధర్ యాదవ్,MEWA వ్యవస్థాపకుడు సాలే వేముల బాబు,గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మల్లి కార్జున నాయక్, యాదవ్ యువత జిల్లా అధ్యక్షులు జిట్టా రామ్ మోహన్ యాదవ్,RPS జిల్లా అధ్యక్షులు కృష్ణమోహన్ యాదవ్,ప్రధాన కార్యదర్శి నారాయణ స్వామి, అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు ప్రతాప్, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు రామచంద్ర ,రామాంజనేయులు, జిల్లా యువత అధ్యక్షుడు శ్రీకాంత్, శివ,చాంద్,తదితరులు పాల్గొన్నారు..