దేశంలో అరుదైన ఘనత ఒకే ఇంట్లో ఐదుగురు మహిళా కలెక్టర్లు
చదువు ప్రస్తుత రోజుల్లో అత్యంత కీలకమైంది. అందుకే సామాన్యుడి నుండి కుబేరుల వరకు అందరూ చదువుకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. దేనికైనా చదువు అనేది ముఖ్యం కావడంతో అందరూ తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఈ ప్రపంచంలో మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు.
ఇది సినిమా డైలాగ్ అయినా కూడా ఇదే సత్యం. ఇకపోతే దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఉద్యోగం అంటే ఐఏఎస్. ఐఏఎస్ అవ్వాలనేది చాలామంది కల. అయితే ఆ కల చాలామందికి అలాగే మిగిపోతుంటుంది. కానీ ఓ కుటుంబంలో ఐదు మంది అక్కచెల్లుళ్లు ఐఏఎస్ సాధించారు.
వివరాల్లోకి వెళ్తే .. జైపూర్ కి చెందిన శ్రీ సహదేవ్ సహరన్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక రైతు. ఆయనకి ఐదుమంది సంతానం. ఐదుమంది కూడా ఆడపిల్లలే. కొడుకులు లేరని కుంగిపోకుండా తన కూతుళ్లనే కొడుకులుగా తీర్చిదిద్దాడు. ఐఏఎస్ కావాలన్న తన కల నెరవేర్చుకోలేకపోయానని.. మీరు నా కోరికను నెరవేర్చాలంటూ కూతుళ్లకు చెప్తూ వచ్చాడు. అలాగే వారందరిని కష్టపడి చదివించాడు. ఈరోజు అతని కష్టం వృధా కాలేదు. ఆ ఐదుగురు కూడా ఆ సరస్వతిని ఆవహించి ఐఏఎస్ లుగా ఎదిగారు.
సాధారణంగా ఒక ఇంట్లో నుండి ఒకరు కలెక్టర్ గా ఎంపికవడయే గొప్ప అలాంటిది సహరన్ కుటుంబం నుంచి ఏకంగా ఐదుగురు అక్కాచెల్లెళ్లు కలెక్టర్లుగా ఎంపికయ్యారు. ఇప్పుడు తండ్రి సహరన్తో పాటు అతని ఐదుగురు బిడ్డలు యువతకు ఆదర్శంగా నిలిచారు.
ఈ అరుదైన ఘటన రాజస్తాన్లోని హనుమాఘర్లో చోటుచేసుకుంది.. 2018లో నిర్వహించిన రాజస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష ఫలితాలు మంగళవారం ప్రకటించారు. హనుమఘర్కు చెందిన అన్షు రీతు సుమన్లు రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కు(ఆర్ఏఎస్) ఏకకాలంలో ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పటికే ఆ ఇంట్లో నుంచి రోమా మంజులు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు.
తాజాగా ఈ ముగ్గురు కూడా ఆర్ఏఎస్కు ఎంపికవడంతో ఆ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లుగా ఉండడం విశేషం. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కష్వాన్ ఆర్ ఏఎస్ కు ఎంపికైన ముగ్గురు అక్కచెల్లెళ్ల ఫోటోను షేర్ చేస్తూ ట్విటర్లో స్పందించారు. ఇది నిజంగా గర్వించదగిన విషయం. అన్షు రీతు సుమన్లు ఏకకాలంలో అడ్మినిస్టేటివ్ సర్వీస్ కు ఎంపికవడం గొప్ప విషయం. ఈ విజయంతో వారి తండ్రికి కుటుంబానికి అరుదైన గౌరవం దక్కింది. అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.