దేవాలయాలపై దాడులు బాధాకరం -బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలక్రిష్ణ యాదవ్
కడప- హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం పని చేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి సంఘటనలు జరిగితే పోలీసులు చాకచక్యంగా దోషులను పట్టుకునేవారు. మన రాష్ట్రంలో ఈ సంవత్సరకాలంలో ఇరవై దేవాలయాలపై దాడులు జరిగితే ఇంతవరకు చర్య తీసుకోలేదు .పోలీసులు దర్యాప్తునకు స్వేచ్ఛ ఇవ్వకుండా కట్టుదిట్టం చేస్తున్నారు అని అనుమానం వేస్తున్నది .ఈ రోజున రెండు పార్టీలు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం చాలా వింతగా ఉంది. దాడులు జరిగే కొన్ని నెలలు కావస్తున్నా. 1) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం జరిగిన నాలుగు నెలలు (6 సెప్టెంబర్ 2020 ).2)విజయవాడ దుర్గమ్మ గుడి లో వెండి సింహాలు అపహరణకు గురై సుమారు ఐదు నెలలు కావస్తోంది (13 సెప్టెంబర్ 2020). 3) ఏలేశ్వరం శ్రీ రామాంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేశారు.4) కృష్ణా జిల్లా కాశీ విశ్వేశ్వరాలయం నంది విగ్రహం ధ్వంసం అయి నాలుగు నెలలు కావస్తోంది .5)కృష్ణా జిల్లా నిడమనూరు సాయిబాబా విగ్రహం ధ్వంసం చేశారు . రెండు రోజుల క్రితం జరిగిన రామతీర్థం శ్రీ కోదండ రామాలయం కొన్ని వందల సంవత్సరాల కిందట వెలసిన ఈ ఆలయం 500 అడుగులు ఎత్తులో ఉన్న ఆలయం శ్రీరాముని తల అపహరించుట ఎంత హేయమైన చర్యగా బిజెపి పార్టీ భావిస్తోంది. చూస్తే ఏదో ఒక పథకం ప్రకారం చేస్తున్నారా అనిపిస్తుంది ఈ దాడుల వెనక ఎంతటి వారున్నా శిక్షించాలని బిజెపి పార్టీ ఆశిస్తున్నది.