దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్దకు చేరుకొని పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు .
మూడురోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవ రోజు గురువారం ఉదయం 9.45 గంటలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్దకు చేరుకొని పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు .
అనంతరం అక్కడ ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కోవిడ్ నేపథ్యంలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ (SoP) మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.
ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సహా ప్రతి ఒక్కరికి హ్యాండ్స్ శానిటేషన్, ధర్మల్ స్క్రీనింగ్ చేశారు. సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమం నిర్వహించారు .ముఖ్యమంత్రితో పాటు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎస్ బి అంజద్ భాష, జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, ఎంఎల్సీ జకియా ఖానం, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్, ఎస్పి కేకేఎన్ అన్బురాజన్, జాయింట్ కలెక్టరు సి.ఎం. సాయికాంత్ వర్మ, ఓఎస్డిఅనిల్ కుమార్ రెడ్డి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు .డాక్టర్ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ఉదయం10.00గం.లకు ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ కు బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి.