దశలవారీగా అందరికీ వ్యాక్సినేషన్ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
జనవరి 16:-దశలవారీగా ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ అందుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.రాయచోటి ఏరియా ఆసుపత్రిలో శనివారం జరిగిన కోవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ ప్రారంభ కార్యక్రమంలో ఎం ఎల్ సి జకియా ఖానంతో కలసి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. రాయచోటి ఏరియా ఆసుపత్రినందు తొలి వ్యాక్సిన్ ను ఆశా వర్కర్ కు గోవిందమ్మకు అందించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో చేయని విధంగా కోవిడ్ వ్యాక్సిన్ ను విడతల వారీగా అందించుటకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు.దేశ స్థాయిలో ప్రధాని మోదీ, రాష్ట్ర స్థాయిలో సీఎం జగన్ లు నేడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. జిల్లా లో 20 కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటుచేయగా అందులో రాయచోటి నియోజకవర్గంలో రాయచోటి ఏరియా ఆసుపత్రి, దేవపట్ల పి హెచ్ సి లలో వ్యాక్సినేషన్ కేంద్రాలును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తొలి విడతలో వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులకు, తుది విడతలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు, తరువాత అందరికీ వ్యాక్సిన్ ను అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయన్నారు. వ్యాక్సినేషన్ పంపిణీలో వైద్య ఆరోగ్య, మున్సిపల్, ఎం పి డి ఓ తదితర శాఖల అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించిన వైద్య ఆరోగ్య, మున్సిపల్, పోలీసు, రెవెన్యూ, స్వచ్చంద సేవకుల కృషిని మరువలేమన్నారు.కోవిడ్ టీకా పై ఎలాంటి అపోహలు, అనుమానాలు అవసరం లేదన్నారు. వ్యాక్సిన్ ఎంతో సురక్షితమైందన్నారు. హెల్త్ కేర్ వర్క ర్లంతా విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ రాంబాబు, అదనపు జిల్లా వైద్యాధికారి రామిరెడ్డి, ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు డా మహేశ్వర రాజు, వైద్యులు డా భాస్కర్ రెడ్డి, ప్రముఖ వైద్యులు బయారెడ్డి, నారాయణ రెడ్డి, రత్నం, ఆసుపత్రి కమిటీ సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్, హెల్త్ ఎడ్యుకేటర్ బలరామరాజు, వైఎస్ఆర్ సీపీ నాయకులు దశరథ రామిరెడ్డి, ఆసీఫ్ అలీఖాన్, ఫయాజుర్ రెహమాన్, మదన మోహన్ రెడ్డి, కొలిమి ఛాన్ బాషా,జాకీర్, జిన్నా షరీఫ్, షబ్బీర్, రియాజ్, సలీం, చిల్లీస్ ఫయాజ్, జయన్న నాయక్, సంజీవ, గువ్వల బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.