తొక్కే కదా అని తీసిపారేయకండి.. అరటి తొక్కతో కలిగే ప్రయోజనాలు అద్భుత:
అరటి పండే కాదు, అరటి తొక్కల్లో(Banana Peel) కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్న విషయం చాలా మందికి తెలియదు. అరటి తొక్కల్లో ఉండే పోషకాలు చర్మ వ్యాధులను, జుట్టు సమస్యలను దూరం చేస్తాయి.అన్ని సీజన్లలో లభించే పండుగా అరటి పండు (Banana) ప్రసిద్ది. అందుబాటు ధరలోనే లభించే ఈ పండ్లను రోజూ తినడం ద్వారా అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకే “రోజూ ఒక అరటిపండు తినండి. డాక్టర్ అవసరాన్ని దూరం చేసుకోండి.” అనే నానుడి ప్రచారంలో ఉంది. అయితే, అరటి పండే కాదు, అరటి తొక్కల్లో(Banana Peel) కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్న విషయం చాలా మందికి తెలియదు. అరటి తొక్కల్లో ఉండే పోషకాలు చర్మ వ్యాధులను, జుట్టు సమస్యలను దూరం చేస్తాయి. అరటి తొక్కల్లోని విటమిన్ A, B, C, ఫైబర్స్ జుట్టు పెరుగుదలను పెంచడానికి, చుండ్రును తగ్గించడానికి, మీ చర్మం యవ్వనంతో ప్రకాశించడానికి సహాయపడుతుంది. అరటి తొక్కలతో కలిగే ఉపయోగాలపై ఓలుక్కేద్దాంమచ్చలేని చర్మం అందరి కల. అరటి తొక్కలతో ఫేస్ మాస్క్ చేసుకుంటే ఈ కలను నిజం చేసుకోవచ్చు. వీటిలోని కార్బోహైడ్రేట్లు(carbohydrates )విటమిన్ B6, B12, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు మీ కణాల పునరుత్పత్తికి సహాయపడతాయి. చర్మం ఉపరితలాన్ని సున్నితంగా చేస్తాయి. అందువల్ల, దద్దుర్లు, ముడతలు, మొటిమలు, ఉన్న ప్రాంతాల్లో అరటి తొక్కలను ఫేస్ ప్యాక్ చేసుకోవడం ద్వారా వాటిని సులభంగా తొలగించవచ్చు అరటి తొక్కల్లో ఉండే విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు (antioxidants )చర్మంపై ముడతలను తగ్గిస్తాయి. చర్మాన్ని ఎల్లప్పుడూ తాజాగా, మెరుస్తూ ఉండేలా చేస్తాయి. పండిన అరటి తొక్కలో ఇథిలీన్ ఉంటుంది. దీనితో ఫేస్ ప్యాక్ చేసుకుంటే చర్మం కాతంతివంతంగా తయారవుతుంది. అయితే, దీనితో మెరుగైన ప్రయోజనాన్ని పొందాలంటే ఇలా చేయండి. ఒక ఫోర్క్ ఉపయోగించి అరటి తొక్క లోపలి భాగాన్ని తీయండి. దాన్ని గుడ్డు పచ్చసొనలో కలపండి. ఆ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేసుకొని 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. ఇలా వారంలో రెండుసార్లు చేయండి. తద్వారా ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు.అరటి తొక్కను సన్నని పొరలుగా కట్ చేసి వాటిని మీ కళ్ళ కింద ఉంచడం వల్ల డార్క్ సర్కిల్స్(Dark Circles) తగ్గుతాయి. అంతేకాక, అరటి తొక్క మీ కళ్ళకు చాలా అవసరమైన చల్లదనాన్ని, తాజాదనాన్ని అందిస్తుంది అరటి తొక్కలో హిస్టామిన్(Histamine), విటమిన్ C&E ఉంటుంది. ఇది తేమ కారకంగా పనిచేసి, చర్మం(skin )పై ఏర్పడే దురదలను తొలగిస్తుంది. చర్మంపై ఆయిల్ను నియంత్రించడానికి అరటి తొక్క బాగా ఉపయోగపడుతుంది. అంతేకాక, ఇది చర్మంపై మొటిమల విచ్ఛిన్నం చేయడంలో, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉత్తమ ఫలితాన్ని పొందడానికి ఇలా చేయండి. అరటి తొక్కపై ఉన్న చర్మాన్ని కట్ చేయండి. దానిలో కొన్ని చుక్కల తేనె, నిమ్మరసాన్ని కలపండి. ప్రభావిత ప్రాంతాల్లో ఆ మిశ్రమాన్ని అప్లై చేసుకొని, 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి అరటి తొక్క జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ను తటస్తం చేస్తాయి. ఇది మీ జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. జట్టు పెళుసుగా మారడం, దెబ్బతినడం, బూడిదరంగులోకి మారడం వంటి వాటికి పరిష్కారాన్ని చూపిస్తుంది.