తెలుగును అధికార భాషగా గుర్తించడం పట్ల హర్షం
తెలుగును అధికార భాషగా గుర్తించడం పట్ల హర్షం
బద్వేలు, ఫిబ్రవరి 10:
తెలుగు భాషలోని తియ్యదనాన్ని, ఆ భాష ఔచిత్యాన్ని గుర్తించిన పరాయి రాష్ట్రం పశ్చిమ బెంగాల్ తెలుగును అధికార భాషగా గుర్తించడం పట్ల తెలుగు భాషోద్యమ సమాఖ్య రాష్ట్ర సభ్యులు, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర సాహితీ పీఠం అధ్యక్షుడు, సాహితీవేతౖ గానుగపెంట నరసింహులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు మాతృభాషగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనే గురిౖంపును కోల్పోయి, ఆంగ్లానికి పట్టం కడుతున్న పరిస్థితుల్లో ఓ పరాయి రాష్ట్రం తెలుగు భాషలోని కమ్మనైన తియ్యదనాన్ని తమ రాష్ట్రం లోని ప్రజలు ఆస్వాదించేందుకు వీలుగా గురిౖంపునివ్వడం తెలుగు ప్రజలకు, తెలుగు దేశానికి గర్వకారణమన్నారు. ఆరు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆ రాష్ట్రం లో తెలుగుకు అధికార భాష హోదా కల్పిస్తూ నిర్ణయించి, శాసనసభలో ప్రవేశ పెట్టారని, అందుకు శాసన సభ ఆమోదం తెలియ చేసిందని, తెలుగు మాతృభాష కాని పరాయి రాష్ట్రం లో అధికార భాష హోదా కల్పించడం చారిత్ర్మకంగా ఆయన అభివర్ణించారు. అంతేకాక ఆ రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగు వారికి అల్ప సంఖ్యాక హోదా కల్పిస్తూ అక్కడి శాసనసభ ఆమోదం తెలిపిందని, అంతేకాక ఆ రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగు వారి సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశ పెడుతూ మమతా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షనీయమని అంటూ ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుకు సముచిత స్థానం కల్పించాలని, అన్ని పాఠశాల ల్లో తెలుగు మాధ్యమంలో బోధన జరపాలని నరసింహులు పేర్కొన్నారు.