Andhra PradeshEast Godavari
తూర్పుగోదావరిలో వింత జంతువు కలకలం..
తూర్పుగోదావరి: జిల్లాలోని జొన్నాడలో వింత జంతువు కలకలం రేపింది. కొద్దిరోజులుగా ఆ జంతువు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు స్థానికులు సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆ వింత జంతువు పశువులపై దాడిచేసి చంపుతున్నట్లు వారు చెప్తున్నారు. ఆలమూరు మండలం పెనికేరులోని ఓ పాడుబడ్డ బావిలో ఆ వింత జంతువు ఉన్నట్లు రైతులు గుర్తించారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.