Andhra PradeshYSR Kadapa
తుమ్మలగుంట శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చీఫ్ విప్, ఎం ఎల్ ఏ లు.
రామాపురం న్యూస్ డిసెంబర్ 25 తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఎంఎల్ఏ లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా లు తో కలసి ఆయన వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల తరహాలో తుమ్మలగుంట శ్రీకళ్యాణ వెంకన్న ఆలయంలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. తొలుత ఆలయ ధర్మకర్త, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎం ఎల్ ఏ రోజా లకు ఆత్మీయ స్వాగతం పలికారు.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు తీర్థ ప్రసాదాలు అందించి దుస్సాలువలతో శ్రీకాంత్ రెడ్డి, రోజా లును సత్కరించారు.