Andhra PradeshChittoorLatest NewsTelangana
తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా

తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు బుధవారం మధ్యాహ్నం బోల్తా పడింది. తిరుమల నుంచి వస్తుండగా.. మొదటి ఘాట్‌రోడ్డులోని 29, 30 మలుపు వద్దకు రాగానే డివైడర్‌ను ఢీకొన్న బస్సు లోయలోకి దూసుకెళ్లింది.ప్రమాద సమయంలో బస్సులో 29 మంది భక్తులు ప్రయాణిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో విధులు ముగించుకొని అదే మార్గంలో వెళ్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రమాదానికి గురైన బస్సు అద్దాలను ధ్వంసం చేసి భక్తులను కాపాడారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, పలువురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.