తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ పనులు పరిశీలించి న ఎం పి డాక్టర్ మద్దిల గురుమూర్తి
అభివృద్ధి పనులు పై అధికారుల తో సమీక్ష
రేణిగుంట మన జనప్రగతి మే 10:-
తిరుపతి ఎం పి డాక్టర్ మద్దిల గురుమూర్తి సోమవారం టి
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ పనుల ను పరిశీలించారు. ఎం పి గా ఎన్నికయ్యాక తొలి సారి గురుమూర్తి విమానాశ్రయం ను స్థానిక లోక్ సభ సభ్యుని హోదా లో సందర్శించి అధికారుల తో సమావేశమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న రన్ వే విస్తరణ పనుల ను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సురేష్ తిరుపతి ఎం పి కి స్వాగతం పలికి విమానాశ్రయం లో జరుగుతున్న విస్తరణ, అభివృద్ధి పనుల వివరాల ను తెలియజేశారు. ఈ సందర్భంగా రన్ వే విస్తరణ కు కొంత ఆటంకంగా ఉన్న సెటిల్ మెంట్ కోర్టు కేసులు, ఇతర లీగల్ వ్యవహారాలు త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల తో మాట్లాడి పనుల కు ఆటంకం లేకుండా చూస్తామన్నారు. రన్ వే విస్తరణ కు మరో ఆటంకం గా ఉన్న హై టెన్షన్ విద్యుత్తు లైన్ మార్పిడి పనులు కూడా తర్వలో పూర్తి అవుతాయని ఎం పి తెలిపారు.
అధికారులు కార్గో విమాన రవాణా సదుపాయం, విమానాలు ఓవరహాలింగ్, మరమ్మతుల కేంద్రం ఏర్పాటు అన్ని 3.8 కి. మీ రన్ వే విస్తరణ పూర్తి కాగానే ఒక్కొక్క టి గా అందుబాటులో కి వస్తాయని అధికారులు తెలిపారు. అలాగే ఎం పి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనులు బ్లూ ప్రింట్ పరిశీలించారు. దేశీయంగా తిరిగే విమానాలు కూడా సమీప భవిష్యత్తులో తిరుపతి విమానాశ్రయం నుంచి పెద్ద సంఖ్యలో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయని ఎం పి తెలిపారు. అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఇమ్మిగ్రేషన్ కౌంటర్, కస్టమ్స్ చెకింగ్ ఇతర సౌకర్యాలు ఏర్పాటు కు ఎం పి గా తన వంతు కృషి చేస్తానని తిరుపతి ఎం పి గురుమూర్తి వెల్లడించారు. ఎం పి పర్యటన లో ఏర్పేడు, రేణిగుంట తహసీల్దార్ లు పుల్లారెడ్డి, శివ ప్రసాద్ , ఎయిపోర్ట్ అథారిటీ అధికారులు, వివిధ ప్రాజెక్ట్ ల అధికారులు పాల్గొన్నారు.