తహసిల్దార్ కార్యాలయనికి తాళం వేసిన వీఆర్ఏలు

నెక్కొండ మండలానికి చెందిన వీఆర్ఏలు రాష్ట్ర వీఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు సోమవారానికి 78 రోజుకు చేరుకున్న ప్రభుత్వము తమ సమస్యలపై స్పందించక పోవడంతో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తాసిల్దార్ కార్యాలయనికి తాళం వేసి నిరసన తెలిపారు. అనంతరం మండలానికి చెందిన వీఆర్ఏ గత కొద్ది రోజుల క్రితం నిరావధిక సమ్మె చేస్తుండగా ప్రభుత్వము తమ సమస్యలను నెరవేర్చకపోవడంతో నెక్కొండ మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ మహ్మద్ ఖాసిం ఆర్థిక ఇబ్బందులతో మనస్థపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సోమవారం నెక్కొండ మండలానికి చెందిన మనం రిపోర్టర్ కాడబోయిన రాజ్ కుమార్, వార్త రిపోర్టర్ డెక్క సాయికుమార్ దాతల సహకారంతో 18,300 రూపాయలను డిప్యూటీ తాహసిల్దార్ రాజ్ కుమార్ చేతుల మీదుగా వీఆర్ఏ ఖాసిం కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ రఘు, తాహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, నెక్కొండ మండల విఆర్ఎ లు పాల్గొన్నారు