Andhra PradeshLatest NewsPolitical
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన నిర్ణయం

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ఆగమనంపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభిచలేనంటూ మూడు పేజీల సుదీర్ఘ లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన తేల్చి చెప్పారు. తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను కోరారు. రాజకీయ ప్రకటనకు ముందు ఆసుపత్రిలో తాను చేరడమనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నట్టు లేఖలో తెలిపారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రకటన అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.ఇటీవల హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ షూటింగ్‌లో పాల్గొన్న అనంతరం అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే.