Andhra PradeshCrimeLatest NewsTelanganaYSR Kadapa
తప్పిన పెనుప్రమాదం బార్ లోకి దూసుకెళ్లిన బస్సు
స్టీరింగ్ వద్ద ఇరుక్కుపోయిన డ్రైవర్
బద్వేలు మన జనప్రగతి, జనవరి 27 :-
నెల్లూరు రోడ్డు మల్లిఖార్జున రెస్టారెంట్ బార్ వద్ద ముందు వెళుతున్న లారీని వెనుక వైపు ఆర్టీసీ బస్సు ఢీకొనడన్న సంఘటనలో ఆర్టీసీ బస్సు వెనుక భాగం బార్ లోకి దూసుకెళ్లింది. బస్సు స్టీరింగ్ పూర్తి విరగడం తో బస్సును అదుపు చేయలేక వెనుకవైపు ఉన్న మల్లికార్జున రెస్టారెంట్ బార్లోకి దూసుకెళ్లింది. బస్సు ఢీకొన్న సంఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు గాయాలయ్యాయి ఆర్టీసీ డ్రైవర్ ను వెంటనే 108 వాహనం లొ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఈ మధ్య కాలంలో ఆర్టిసి బస్సులు అనేక ప్రమాదాలకు గురికావడంతో అనేకమంది ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలు విస్మయానికి గురిఅయ్యారు.