Andhra PradeshLatest NewsTelangana
డ్రగ్స్ రాకెట్ లో ఓ టాలీవుడ్ నటితోపాటు చాంద్ అనే వ్యక్తిని అధికారులు అరెస్ట్
ముంబై: ముంబైలో డ్రగ్స్ రాకెట్ కలకలం సృష్టించింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)ముంబైలోని ఓ హోటల్‌పై దాడులు నిర్వహించింది. ముంబై మీరా రోడ్డు సమీపంలో గల హోటల్ లో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేసిన అధికారులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రాకెట్ లో ఓ టాలీవుడ్ నటితోపాటు చాంద్ అనే వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. సదరు నటి నుంచి 400గ్రాముల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.2020లో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ లింక్ వెలుగులోకి రావడంతో ఎన్సీబీ అధికారులు దీపికాపదుకొనే, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్‌సింగ్‌తోపాటు పలువురిని విచారించిన విషయం తెలిసిందే.