‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్”గా హైదరాబాద్ గుర్తింపు

విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న భాగ్యనగర కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ”ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్”గా హైదరాబాద్ గుర్తింపు పొందినట్లు మంత్రి కేటీఆర్ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏవో)తో కలిసి పనిచేసే ఆర్బర్ డే ఫౌండేషన్ సంస్థ హైదరాబాద్‌కు ఈ బిరుదునిచ్చిందని కేటీఆర్ తెలిపారు. పచ్చదనం పెంపొందించడంలో సత్ఫలితాలు సాధిస్తోన్న హైదరాబాద్ నగరానికి ఈ గుర్తింపు దక్కడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రకమైన గుర్తింపు సాధించిన ఏకైక భారతీయ నగరంగా హైదరాబాద్ నిలవడం విశేషం.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాలకు దక్కిన ఫలితమే ఈ గుర్తింపు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రకమైన గుర్తింపు సాధించిన ఏకైక భారతీయ నగరంగా హైదరాబాద్ నిలవడం విశేషం.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాలకు దక్కిన ఫలితమే ఈ గుర్తింపు అని కేటీఆర్ పేర్కొన్నారు.