ట్రిపుల్‌ఐటీ ప్రవేశాలకు సంబంధించి స్వల్ప మార్పులు
వేంపల్లె మన జనప్రగతి న్యూస్ : ట్రిపుల్‌ఐటీ ప్రవేశాలకు సంబంధించి స్వల్ప మార్పులు చేసినట్లు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి తెలిపారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో ఓపెన్ కేటగిరికి చెందిన కొన్ని సీట్లు మిగిలాయన్నారు. ఇందుకు సంబంధించి శనివారం ఉదయం 8 గంటలకు 4,001 నుంచి 5000 ర్యాంకు వరకు, ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, ఎస్సీ కేటగిరికి చెందిన కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన వారు బీసీ కేటగిరి, ఆంధ్రా యూనివర్శిటీ, శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ పరిధిలో విద్యార్థులు నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు హాజరుకావాలని ఆమె కోరారు. 5001 నుంచి 7000 ర్యాంకు వరకు ఎస్వీయూ లోకల్ ఏరియాకు సంబంధించిన ఓసీ, బీసీ-బి, బీసీ-సి, బీసీ-ఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కోటా విద్యార్థులు బీసీ-ఏకు చెందిన ఆంధ్రా యూనివర్శిటీ, ఎస్వీయూ రీజియన్‌కు చెందిన విద్యార్థులు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఇడుపులపాయలో కానీ, నూజివీడులోని క్యాంపస్‌లో కానీ హాజరై ప్రవేశాలు పొందాలని ఆమె కోరారు.