Andhra PradeshChittoorLatest NewsPoliticalTelangana
టీడీపీ నాయకులను అరెస్ట్ విమానాశ్రయం వద్ద భారీగా పోలీసులు
చిత్తూరు: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులను గృహ నిర్బంధం చేసారు. రేణిగుంట ఆంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జిల్లా టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి వాహనాల్లో తరలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా ధర్నాను చేపట్టి తీరుతామని నాయకులు చెబుతున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానీని పోలీసులు అడ్డుకున్నారు.