టీడీపీకి భారీ షాక్!
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో భారీ దెబ్బ తగలనుంది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. గతేడాది తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. టీటీడీపీ అధ్యక్షుడుగా ఉన్న ఎల్.రమణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ నేతలు గత సెప్టెంబర్‌లో తిరుగుబాటుకు దిగారు. తెలంగాణ పార్టీ నాయకత్వ మార్పు కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. గత ఏడేళ్లుగా ఒకే వ్యక్తి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారని, రాష్ట్రంలో పార్టీ ఉనికి ఆందోళనలో పడిరదని, ఇప్పటికైనా అధ్యక్షుడిని మార్చాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రమణ సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవిపై హామీ లభించడంతో ఎల్.రమణ టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఈ వారంలోనే ఎల్.రమణ టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు కనబడుతున్నాయి