Andhra PradeshLatest NewsPoliticalTelangana
టీకా తీసుకున్న ప్రధానమంత్రి మోదీ!
మన జనప్రగతి:ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం కొవిడ్ టీకా తీసుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని మోదీ తొలి డోసు టీకాను తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన దేశప్రజలంతా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మనమందరం కలిసికట్టుగా భారత్‌ను కొవిడ్ రహిత దేశంగా తీర్చిదిద్దాలని’ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాను తీసుకున్నారు. ఎయిమ్స్‌లో పనిచేస్తున్న సిస్టర్ నివేదా ప్రధానికి టీకా ఇచ్చారు.