టాటా కంపెనీలో పనిచేసిన మాజీ ఉద్యోగి అనారోగ్యానికి గురయ్యాడని తెలిసి ఆయనే స్వయంగా సదరు ఉద్యోగి ఇంటికెళ్లి మరీ పరామర్శించారు.
వ్యాపారం అంటే లాభాలు, నష్టాలు అని మాత్రమే భావించే ఎంతో మంది యజమానులు తమ ఉద్యోగుల గురించి పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడూ లాభనష్టాల గురించే ఆలోచిస్తారు. కానీ టాటా కంపెనీలో తనదైన ముద్ర వేసుకున్న రతన్ టాటా మాత్రం దీనికి అతీతులు. తమ ఉద్యోగులు పట్ల అత్యంత శ్రద్ధ కనబరిచే వ్యక్తి. ఆయన పెద్ద మనస్సు గురించి చెప్పటానికి ఎన్నో సందర్భాలున్నాయి.అటువంటిదే ఇది. గతంలో టాటా కంపెనీలో పనిచేసిన మాజీ ఉద్యోగి అనారోగ్యానికి గురయ్యాడని తెలిసి ఆయనే స్వయంగా సదరు ఉద్యోగి ఇంటికెళ్లి మరీ పరామర్శించారు.
డబ్బే ముఖ్యమని భావించే ఈ రోజుల్లో…అంతకంటే ముఖ్యమైంది మానవత్వం అని నిరూపించారు రతన్ టాటా.
తమ కంపెనీలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి గత రెండేళ్లుగా అనారోగ్యంతో ఉన్నాడని తెలిసి పరామర్శించేందుకు ఆయన స్వయంగా ముంబై నుంచి పుణే వెళ్లాడు. అంత పెద్ద స్థాయిలో ఉండే రతన్ టాటా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఓ సాధారణ వ్యక్తిలాగా మాజీ ఉద్యోగి కోసం వెళ్లిన ఫోటోలో వైరల్ గా మారాయి. 83 ఏళ్ల ఈ వ్యాపార దిగ్గజం ఎలాంటి మీడియా హడావిడీ లేకుండా, కనీసం తన వెంట బౌన్సర్లను కూడా తీసుకెళ్లకుండా పరామర్శకు వెళ్లడం విశేషం.83 ఏళ్ల లివింగ్ లెజండ్ రతన్ టాటా భారత దేశంలోనే అత్యంత గొప్ప వ్యాపారవేత్త. రెండేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ యోగేశ్ దేశాయ్ అనే తమ మాజీ
ఉద్యోగిని పరామర్శించేందుకు ముంబై నుంచి పుణేలోని ఫ్రెండ్స్ సొసైటీకి వచ్చారు. ఆయన కూడా మీడియా లేదు, బౌన్సర్లు లేరు… విధేయత గల ఉద్యోగుల పట్ల కేవలం అంకితభావం మాత్రమే ఉంది. అందుకే ఆయన రతన్ టాటా అంత గొప్పవారు అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.