Andhra PradeshEducationLatest NewsPoliticalTelangana
జులై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభం

కేసుల తగ్గుముఖం, లాక్‌డౌన్ ఎత్తివేతతో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. శనివారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదంది. తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలంది. అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయి నియంత్రణకు ప్రజలు తమ సంపూర్ణ సహకారం అందించాలని కేబినెట్ కోరింది.