జిల్లా ప్రజలు.. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలి
జిల్లా ప్రజలు.. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలి
“ఖాదర్ వలీ బాబా” జెండా ఉత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్. బి.అంజాద్
కడప, ఫిబ్రవరి 11 : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో జిల్లా ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా ఆకాంక్షించారు. గురువారం రాత్రి నగరంలోని పాలెంపపయ్య వీధిలో 30వ డివిజన్ ఇంచార్జి మజర్ అలీ ఖాన్ ఆద్వర్యంలో నిర్వహించిన “ఖాదర్ వలీ బాబా” జెండా ఉత్సవం కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది దస్తగిరి మాసంలో ‘ఖాదర్ వలీ బాబా’ జెండా ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పూర్వీకుల ఆచారాలను, సంప్రదాయాలను గౌరవిస్తూ.. వాటిని భవిస్యతరాలకు అందించడంలో భాగంగా ఇలాంటి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని ప్రతిబింబింపజేసి, సన్మార్గంలో నడిపిస్తాయన్నారు. ఆ ‘ఖాదర్ వలీ బాబా’ ఆశీస్సులు ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని, జిల్లా ప్రజలంతా.. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని.. ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానన్నారు.కార్యక్రమంలో ముందుగా.. ఉపముఖ్యమంత్రి “ఖాదర్ వలీ బాబా” దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు సమర్పించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో.. 30వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి, మైనారిటీ నాయకులు షఫీ, ఇర్ఫాన్, హాబీబుల్లా, ఆన్సర్, నతహార్ అలీఖాన్, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.