Andhra PradeshLatest NewsYSR Kadapa
జగన్ జన్మదిన సందర్భంగా దంతులూరి కృష్ణ దివ్యాంగులకు దుస్తులు వితరణ
పులివెందుల డిసెంబర్ 21 సమాజంలో అత్యంత వెనుకబడ్డ వర్గాలైన దళిత, బలహీన వర్గాల తో పాటు, అంగవైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులను ఆదుకోవాలనే , జగనన్న స్ఫూర్తితో వారికి సేవా కార్యక్రమాలను చేపట్టి, అభాగ్యులకు చేయూతనందించడమే తన ముందున్న లక్ష్యమని, రాజకీయాలకతీతంగా కుల, మత , ప్రాంతాలను పక్కన పెట్టి అభాగ్యులను ఆదుకోవడమే ప్రధాన అజెండాగా పని చేస్తానని , జగనన్న జన్మదినోత్సవం , యువ సేవా దినోత్సవంగా జరుపుకుని, వివిధ వర్గాలకు పార్టీ శ్రేణులు సహాయ సహకారాలు అందించాలని వైకాపా అగ్రనాయకులు దంతులూరి కృష్ణ పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ 48వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, స్థానిక మారుతి హాల్ సమీపంలోని దంతులూరి కృష్ణ నివాసంలో ఏపీ వికలాంగుల నెట్ వర్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మ దినోత్సవ కార్యక్రమంలో ఆయన , జగన్ బర్త్ డే కేక్ కట్ చేసి దివ్యాంగుల పంపిణీ చేశారు. అనంతరం కృష్ణ ఆర్థిక సహాయంతో 30 మంది దివ్యాంగులకు దుస్తుల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వికలాంగుల నెట్వర్క్ రాష్ట్ర అధ్యక్షులు ఇరికి రెడ్డి రఘునాథ రెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగుల ఆశాజ్యోతి జగనన్న జన్మదినం వికలాంగులకు పర్వదిన మని, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు రక్తదాన శిబిరాలతోపాటు, సమాజంలో అట్టడుగున ఉన్న దివ్యాంగుల ను ఆదుకోవాలని, అందులో భాగంగా దంతాలూరు కృష్ణ , మంచి మనసుతో , సేవాతత్పరత తో దివ్యాంగులకు చేయూతనందించడం, అభినందనీయమని , ఆయన స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకొని వెళ్లి , అభాగ్యులకు ఆసరా కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం బ్రాహ్మణ సేవా సంఘం నిరంజన్ శర్మ ఏర్పాటుచేసిన జగన్ బర్త్ డే కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. అనంతరం వికలాంగుల నెట్ వర్క్ ఆధ్వర్యంలో కృష్ణ ను శాలువా తో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వికలాంగుల నెట్వర్క్ రాష్ట్ర అధ్యక్షులు రఘునాథ రెడ్డి, అంబకపల్లె బాబు రెడ్డి, కౌన్సిలర్ ఖాదర్ బాషా , తేర్నo పల్లి భాస్కర్ రెడ్డి , శివ శేఖర్ రెడ్డి , కృష్ణ వ్యక్తిగత సహాయకులు షామీర్ భాష, వికలాంగుల గ్రామీణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు ఆర్. వెంకటసుబ్బయ్య, సునీల్, గంగయ్య, వేణు, బషీర్, జగదీష్, వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు.