జగన్ ఓ ఉన్మాది -అక్రమ కేసులతో టీడీపీని భూస్థాపితం చేయాలని చూస్తున్నారు
జగన్ ఓ ఉన్మాది
-అక్రమ కేసులతో టీడీపీని భూస్థాపితం చేయాలని చూస్తున్నారు
-నియంతలంతా చరిత్ర కాలగర్భంలో కలిసి పోయారు
-జగన్‌రెడ్డికి కూడా అదే గతి పడుతుంది
-తెలుగు మహిళా కర్నూలు పార్లమెంటు ప్రధానకార్యదర్శి సుకన్యదేవి
కర్నూలు : జగన్‌రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపి పైశాచిక ఆనందం పొందుతున్నారని, కేసులు, అరెస్టుల వల్ల టీడీపీ నేతలు అదరరు, బెదరరని మరింత కసి, పట్టుదలతో పని చేస్తారని తెలుగు మహిళ కర్నూలు పార్లమెంటు ప్రధానకార్యదర్శి సుకన్యదేవి అన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రామతీర్థంలో రాముడి విగ్రహం తల తీసేస్తే పరిశీలించడానికి వెళ్ళిన చంద్రబాబు, కళావెంకట్రావు, అచ్చెన్నాయుడు తదితర టీడీపీ నేతలపై కేసులు పెట్టడం విచిత్రంగా ఉందన్నారు. చంద్రబాబు వస్తున్నాడని తెలిసి విజయసాయిరెడ్డికి అదే సమయంలో అనుమతి ఇవ్వడం ఉద్రిక్తతలకు ఆజ్యం పోసిందన్నారు. రెండు వర్గాలు కలిస్తే గొడవలు జరుగుతాయని తెలిసి కూడా పోలీసులు అనుమతి ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు. కడుపుమండిన
వ్యక్తులు ఎవరో విజయసాయిరెడ్డిపై చెప్పులు విసిరితే తమ పార్టీ పెద్దలపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. విజయసాయిరెడ్డిపై దాడి జరిగిన సమయంలో తమ పార్టీ పెద్దలు ఎవరూ కూడా అక్కడ లేరన్నారు. అయినా అధికార పార్టీ పెద్దల ఒత్తిడితో పోలీసులు తమ పార్టీ పెద్దలపై కేసులు నమోదు చేయడమే కాక రాత్రి సమయంలో అన్నం తినే వ్యక్తులను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం మరీ దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో టీడీపీని భూస్థాపితం చేసేందుకు సీఎం పక్కా ప్రణాళిక ప్రకారం టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి
వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. టీడీపీని భూస్థాపితం చేసేందుకు జగన్ తండ్రి రాజశేఖర్‌రెడ్డి వల్లే కాలేదని, జగన్ వల్ల ఏమవుతుందని అన్నారు. సీఎం ఇప్పటికైనా కక్ష్య సాధింపు చర్యలు మానుకొని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవుపలికారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఎక్కడ కూడా ఒక రోడ్డు గాని, ఒక పరిశ్రమ గాని వచ్చిన దాఖలాలు లేవన్నారు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని సంక్షేమ పథకాల ముసుగులో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అన్ని చూస్తున్నారని త్వరలోనే
జగన్‌కు గూబ గుయ్ అనేలా తీర్పు ఇవ్వడం ఖాయుమన్నారు.