చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం జగన్
కోవెలకుంట్ల.. అవుకు.. (రాయలసీమ కలం) కోవిడ్ 19 పోరాడి కోలుకోలేక ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ముందుగా ఏర్పాటు చేసిన చల్లా రామకృష్ణారెడ్డి చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి నేనున్నానంటూ ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ముందుగా అవుకు కు చేరుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి కి హెలిప్యాడ్ ల్యాండింగ్ వద్దా బనగానపల్లె శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు గంగుల ప్రభాకర్ రెడ్డి, గంగుల బిజెంద్రనాథ్ రెడ్డి, మంత్రి గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రా హర్ష వర్ధన్ రెడ్డి, కలెక్టర్ వీరపాండియన్, జిల్లా ఎస్పీ పక్కీరప్ప తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.