చలో కడప ను జయప్రదం చేయండి
బద్వేలు,డిసెంబర్ 20 :
బద్వేల్ మునిసిపాలిటి పరిధిలోని చిన్న అగ్రహారం,పెద్ద అగ్రహారం,తొట్టిగారి పల్లి గ్రామంలో సిపియం బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులకు సంఘీభావంగా చిన్న అగ్రహారం పెద్ద అగ్రహారం తొట్టి గారి పల్లి గ్రామంలో మరియు వ్యవసాయ పొలాల్లో రైతులను కలిసి బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేసి 22వ తేదీన జరిగే చలో కడప కార్యక్రమానికి వేలాదిగా రైతుల తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ రైతులు పండించే పంటకు ఒప్పందం చేసుకుని ఆ ధరకు వారికే అమ్మాలని, సివిల్ కోర్టు పోవడానికి చట్టంలో వీలు కల్పించలేదని ప్రభుత్వ మార్కెట్ యార్డులు ఉండవని ప్రైవేట్ కార్పొరేట్ వ్యాపార సూత్రం మీద ఆధారపడి ఉండాల్సి వస్తుందని, దాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉండదని వ్యాపారం మార్కెట్ పోటీ కారణంగా ధరలు పెరుగుతాయని, రైతులకు మంచి లాభాలు వస్తాయని అందుకోసం మోడీ ప్రభుత్వం చట్టాలు చేస్తే రైతు సంఘాల రాద్ధాంతం చేస్తున్నాయని రైతు ఉద్యమాలు తప్పుడు ప్రచారం చేస్తున్నదని, మోడీ ప్రభుత్వం ఈ చట్టంలో మార్పులు చేసి రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ మంగళం పలకాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం జారీ చేసిందని, రైతన్నల నేస్తం జగనన్న రాష్ట్రంలోని 18 లక్షల విద్యుత్ మీటర్లు మెట్ట ప్రాంత రైతులు ముఖ్యంగా రాయలసీమ రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయని, అందుకే డిసెంబర్ 22 వ తేదీన జరిగే రైతు ఉద్యమానికి రైతులు,కార్మికులు,మహిళలు విద్యార్థులు, వృత్తిదారులు ,బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ రైతులకు అండగా నిలబడాలని అందరూ హాజరై రైతుల పోరాటంలో పాల్గొనాలని కోరారు. అందుకే దీన్ని వ్యతిరేకిస్తూ కడప జిల్లా లో 22వ తేదీన జరిగే ఆందోళన పోరాటాల రైతులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కరపత్రాల పంపిణీ లో సిపియం బద్వేలు పట్టణ కమిటీ సభ్యులు బల్లి ఓబయ్య నాయబ్,అవాజ్ జిల్లా అధ్యక్షులు చాంద్ భాషా, పార్టీ సభ్యులు ఇబ్రహీం, అగ్రహారం రైతులు పిచ్చయ్య,సుధాకర్ రెడ్డి,సాం బశివారెడ్డి ,వీరారెడ్డి వినోద్ ప్రేము,సుబ్బయ్య, తొట్టిగారి పల్లి గ్రామం లో అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు హుసేనమ్మా,రైతులు బాబు , చిన్న సుబ్బయ్య, పెద్ద సుబ్బయ్య,శుభాన్,మోదిన్ సాహెబ్, పీరమ్మ,గోపాలమ్మ,సుబ్బమ్మ,నారాయనమ్మ తదితరులు పాల్గొన్నారు.