చలో కడప కు బయల్దేరిన రైతులు, కార్మికులు ప్రజలు
బద్వేలు,డిసెంబర్ 22 :
సిఐటియు జిల్లా కార్యదర్శి కాలువ నాగేంద్రబాబు ఛలో కడపకు బయలుదేరు వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ
వరి ,వేరుశనగ, అరటి ,బొప్పాయి ,దానిమ్మ ,పూలు మొదలైన పంటలు భారీ వర్షాలు ,నివార్ తుఫాను కారణంగా సర్వనాశనం అయ్యాయని ఇప్పటివరకు ప్రభుత్వం జిల్లా రైతులకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించలేదని తక్షణం పరిహారం చెల్లించాలని,విత్తనాలు ఎరువులు ఉచితంగా అందించాలని బ్యాంకులు షరతులు లేకుండా అప్పు ఇవ్వాలని, పంట రుణాలను రీ షెడ్యూల్ చేసివడ్డీ మాఫీ చేయాలని, అలాగే గత 26 రోజులుగా ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతు ఉద్యమ పోరాటానికి సంఘీభావంగా మంగళవారం కడప కలెక్టరేట్ కు బయల్దేరిన వందలాది మంది రైతులు ,కార్మికులు, ప్రజలు వస్తున్నారని కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన 03 వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నామని వెంటనే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను 3 ఉపసంహరించుకోవాలని తెలిపారు. చలో కడప కలెక్టరేట్ కు బయలుదేరిన వారిలో సిపిఎం పార్టీ బద్వేల్ పట్టణ కమిటీ సభ్యులు ఖాదర్ హుస్సేన్,ప్రవీణ్ కుమార్ , మస్తాన్ ,మస్తాన్ షరీఫ్, బల్లి ఓబయ్య, బ్రహ్మయ్య , ఆవాజ్ జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా, రైతులు, కార్మికులు చెన్నయ్య ,బాలయ్య సుబ్బారావు ,ఎల్లమ్మ , బద్దల ఓబులేసు, బొడ్డు రవి ,మస్తాన్ బాబయ్య ,రవి ,అనంతమ్మ ,ప్రసాద్,వృత్తి దారుల సంఘము నాయకులు సుబ్బారాయుడు, బిల్లింగ్ వర్కర్ల సంఘము నాయకులు S. నాయబ్ రసూల్ ,రాయప్ప రైతులు ప్రజలు కార్మికులు వెళ్లారు.